భూతల స్వర్గంలో యశ్ ఫ్యామిలీ!
on Jan 20, 2021
'కేజీఎఫ్'తో కన్నడ స్టార్ యశ్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను చేస్తున్న 'కేజీఎఫ్' 2పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న అంచనాలు ఆకాశాన్ని చుంబిస్తున్నాయి. యశ్ బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ వాల్యూ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ 'కేజీఎఫ్ 2' షూటింగ్ ఇటీవలే ముగిసింది. దర్శక నిర్మాతలు దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో తలమునకలై ఉన్నారు.
అయితే యశ్ మాత్రం షూటింగ్ పూర్తవడంతో కొద్ది రోజులు పనికి సెలవు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం భార్య రాధికా పండిట్, పిల్లలు ఐరా, యథర్వ్‌లతో కలిసి మాల్దీవులకు విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ వారితో కలిసి దిగిన అందమైన ఫొటోలను షేర్ చేసి, "If there was a tropical paradise.. then this would be it!! Maldives.. here we come!!" అంటూ క్యాప్షన్ పెట్టాడు.
తాజాగా మరికొన్ని ఫొటోలను యశ్ షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో యశ్ వైట్ ట్రౌజర్, వైట్ అండ్ బ్లూ కలర్‌ఫుల్ డిజైనర్ షర్ట్ ధరించి ఉండగా, రాధిక రెడ్ కలర్‌పై వైట్ స్పాట్స్ ఉన్న ట్రాన్స్పరంట్ గౌన్‌లో మెరిసిపోతున్నారు. ఒక ఫొటోలో కొడుకుతో పడుకొని సెల్ఫీ తీస్తున్నాడు యశ్. ఇంకో ఫొటోలో కూతురు ఐరా నాలుక బయటపెట్టి కనిపిస్తోంది.
మొత్తానికి మాల్దీవులనేవి సినిమా స్టార్స్ జాలీ ట్రిప్‌లకు బెస్ట్ డెస్టినేషన్‌గా మారిపోయినట్లు అర్థమవుతోంది. పొల్యూషన్‌కు దూరంగా, ప్రకృతి అందాలకు నెలవుగా, చల్లటి సముద్ర గాలులతో మాల్దీవులు సెలబ్రిటీలను ఆకర్షిస్తున్నాయి. అందుకే ఆ ఐలాండ్‌ను భూతల స్వర్గంగా యశ్ సహా అందరూ భావిస్తున్నారు.
Also Read