వైరల్ అవుతున్న యామీ గౌతం పోల్ డ్యాన్స్
on Jul 11, 2018
యామీ గౌతమ్లో అందానికీ, అభినయానికీ కొదవ లేదు. కాకపోతే ఈ అమ్మడికి ఇప్పటివరకూ మంచి బ్రేక్ రావడం లేదు. ఆమె నటించిన సినిమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఒకవేళ వాటిలో ఏదన్నా సినిమా హిట్ అయినా కూడా అందులో యామీ గౌతమ్ ప్రసక్తి ఉండటం లేదు. అందుకే యామీ అంటే కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలే గుర్తుకువస్తున్నాయి.
ఇదంతా చూసి బాధపడిందో ఏమో కానీ... కాస్త కొత్తగా ఏదన్నా ట్రై చేద్దమానుకుంది యామీ. అందుకే పోల్ డాన్స్ నేర్చుకుంది. ఆ డాన్స్ చేస్తున్న వీడియోలను ఇప్పుడు ఏకంతా తన ఇన్స్టాగ్రాంలోనే ఉంచింది. మరి ఇది రాబోయే చిత్రం కోసమో లేకపోతే అభిమానులను అలరించడానికా అన్నది తెలియదు. కారణం ఏదైనా ఈ డాన్స్ మాత్రం ఇప్పుడు వైరల్గా మారింది.