నిహారిక నిశ్చితార్థం... పవన్ ఎందుకు రాలేదు?
on Aug 14, 2020
అమావాస్య రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించినట్టు మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించలేదు. కనిపించలేదు అనడం కంటే రెండో అన్న నాగబాబు కుమార్తె ఫంక్షన్‌కి ఆయన అసలు రాలేదు. ఎందుకు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం దీనికి హాజరైంది. మెగా ఫ్యామిలీ పెద్ద చిరంజీవి, సురేఖ దంపతులు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక, మెగా ఫ్యామిలీలో రెండో తరం గురించి చెప్పనవసరం లేదు. నిహారికతో యంగ్ బ్యాచ్ అంతా కలిసి ఫొటోలు దిగారు. మెగాభిమానులకు ఆకాశంలో తారలు అన్నిటినీ ఒక్కచోట చూసిన అనుభూతి కలిగింది. కానీ, పవన్ కల్యాణ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అదే చర్చనీయాంశం అవుతోంది.
ఇటీవల హీరో నితిన్ వివాహం జరిగింది. అతడు పవన్ వీరాభిమాని. పెళ్లికి వెళ్లలేదు కానీ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కి పవన్ వెళ్లి వచ్చారు. అన్న కూతురి కంటే పవన్‌కి నితిన్ ఎక్కువా? అనే కామెంట్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఇంట్లో వేడుకకు పవన్ ఎందుకు రాలేదో మరి?