పవన్ కల్యాణ్ పెళ్లాడింది డానా మార్క్స్‌ని అని మీడియా పొరబడిన వేళ...
on Oct 27, 2020
అన్నా లెజ్నెవా అనే రష్యన్ వనితను పవన్ కల్యాణ్ 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసకున్నారు. ఇది ఆయనకు మూడో వివాహం అనే విషయం తెలిసిందే. ఎర్రగడ్డ రిజిస్ట్రార్ ఆఫీసులో వీరికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. అయితే పెళ్లయిన మూడు నెలలకు కానీ ప్రపంచానికి ఈ విషయం వెల్లడి కాలేదు. పవన్ ఓ విదేశీ వనితను వివాహమాడారంటూ కొన్ని ప్రచార, ప్రసార సాధనాలు తప్పుడు ఫొటోలను ప్రచురించాయి, ప్రసారం చేశాయి. అంటే ఆ ఫొటోల్లో పవన్‌తో ఉన్నది ఆయన భార్య అన్నా లెజ్నెవా కాదు, డానా మార్క్స్ (పై ఫొటోలో ఉన్నది డానా మార్క్స్). పవన్‌తో డానా 'తీన్ మార్' సినిమా చేయడంతో ఆయన పెళ్లాడింది ఆమెనే అని చాలామంది పొరబడి, ఆమె ఫొటోలను ప్రచురించాయి.
నిజానికి అన్నా లెజ్నెవా కూడా పవన్‌కు పరిచయమైంది 'తీన్ మార్' సెట్స్ మీదే. అందులో ఆమె కూడా ఓ చిన్న పాత్రను చేశారు. ఆమెతో పరిచయం పెరిగి, సన్నిహితత్వంగా మారడంతో ఆ ఇద్దరూ సహ జీవనం ప్రారంభించారని సమాచారం. తమ అనుబంధాన్ని వారు వెంటనే బహిర్గతం చేయకపోవడానికి కారణం.. అప్పటికింకా రెండో భార్య రేణూ దేశాయ్‌కీ, పవన్‌కూ విడాకులు మంజూరు కాకపోవడం.
2014 ఆరంభంలో పవన్ మూడో పెళ్లి చేసుకున్నారనే వార్త బయటకు వచ్చింది. అయితే ఆయన పెళ్లాడింది 'తీన్ మార్'లో తనతో కలిసి నటించిన డాన్ మార్స్క్ని అని మీడియాతో పాటు చాలా మంది పొరబడ్డారు. కారణం.. డానా ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చి, పవన్ పక్కనే కూర్చోవడం! ఎర్రగడ్డ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పవన్, అన్నా పెళ్లి విషయం వెల్లడయ్యాక కూడా డానాతో పవన్ ఉన్న ఫొటోనే మీడియా ప్రసారం చేసింది. అదీ సంగతి!
Also Read