'ఆర్ఆర్ఆర్' తర్వాత ఏంటనేది క్వశ్చన్
on Nov 16, 2019
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ. కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్, సుకుమార్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. 'రూలర్' తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి నటసింహం నందమూరి బాలకృష్ణ రెడీ. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ బాబుతో ఫలానా దర్శకులు చేస్తారని పేర్లు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మూడు నెలలు బ్రేక్ తీసుకుని ఎవరితో చేయాలనేది డిసైడ్ అవుతారు. 'అల.. వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సుకుమార్ స్క్రిప్ట్ తో రెడీ. ఆల్మోస్ట్ సీనియర్ స్టార్స్, యంగ్ స్టార్స్ అందరికీ రెండు మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ గురించి క్లారిటీ లేదు.
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 'బాహుబలి' అంత విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా లెవల్ సినిమా చేస్తారా? తెలుగు మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేస్తారా? అనేది క్వశ్చన్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో 'సాహో' చేశాడు. ఇటు తెలుగు, అటు హిందీ మార్కెట్స్ కి తగ్గట్టు తీయాలనే ప్రయత్నంలో ఇటు అటు కాకుండా తీశారు. యాక్షన్ ఉన్నప్పటికి, ఎమోషన్స్ మిస్ అయ్యాయని కంప్లయింట్ వచ్చింది. ప్రస్తుతానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత తెలుగుకు తగ్గట్టు సినిమాలు చేసి, కుదిరితే హిందీలో డబ్బింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇద్దరితో సినిమాలు చేయడానికి స్టార్ దర్శకులు అందరూ రెడీ అంటారు. అయితే ముందు రాజమౌళి సినిమాలు పూర్తి చేయాలి. అప్పటికి మిగతా దర్శకుల్లో ఎవరు ఖాళీగా ఉంటారో చూడాలి.