'వార్' బాక్సాఫీస్: 2019 బిగ్గెస్ట్ హిట్ దిశగా...
on Oct 11, 2019
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్లో 200 కోట్ల రూపాయల క్లబ్లో జాయినయ్యింది. బుధవారం 11 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన ఆ మూవీ గురువారం మరో 9 కోట్లను రాబట్టింది. వెరసి.. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా. మొదటివారం వసూళ్లపరంగా హృతిక్, టైగర్, ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్) కెరీర్లో ఇదే హయ్యెస్ట్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఈ క్రమంలో వైఆర్ఎఫ్ మునుపటి రికార్డ్ హోల్డర్ 'సుల్తాన్'ను అది అధిగమించింది. 2019లో ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచేందుకు పరుగులు తీస్తోంది 'వార్'.
దేశవ్యాప్తంగా 'వార్' వసూళ్లు ఎలా ఉన్నాయంటే...
అక్టోబర్ 2 - రూ. 51.60 కోట్లు
అక్టోబర్ 3 - రూ. 23.10 కోట్లు
అక్టోబర్ 4 - రూ. 21.30 కోట్లు
అక్టోబర్ 5 - రూ. 27.60 కోట్లు
అక్టోబర్ 6 - రూ. 36.10 కోట్లు
అక్టోబర్ 7 - రూ. 20.60 కోట్లు
అక్టోబర్ 8 - రూ. 27.75 కోట్లు
అక్టోబర్ 9 - రూ. 11.20 కోట్లు
అక్టోబర్ 10 - రూ. 9.25 కోట్లు
ఇప్పటివరకూ వసూలు చేసింది - రూ. 228.50 కోట్లు (హిందీ వెర్షన్)
తెలుగు, తమిళ వెర్షన్లు రాబట్టిన వసూళ్లు - రూ. 9.85 కోట్లు
మొత్తం - రూ. 238.35 కోట్లు