ప్రభాస్‌ని ఢీ కొట్టబోతున్న విజయ్ సేతుపతి?
on Jan 22, 2021
సలార్.. సాహో తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్. కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. గోదావరిఖని కోల్ మైన్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫిబ్రవరి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. సలార్ లోని ప్రతినాయకుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ నటుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహమ్ కూడా ఉన్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కోలీవుడ్ స్టార్, మాస్టర్ విలన్ విజయ్ సేతుపతి.. సలార్ లో విలన్ గా నటించే అవకాశముందట. ఈ మేరకు మక్కల్ సెల్వన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే సలార్ లో విజయ్ సేతుపతి ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. మాస్టర్ కి హైలైట్ గా నిలిచిన విజయ్ సేతుపతి పెర్ ఫార్మెన్స్.. సలార్ కి కూడా ప్రధాన బలంగా నిలుస్తుందేమో చూడాలి.
ఈ ఏడాది దసరా సీజన్ లో సలార్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.