మాస్టర్.. డేట్ ఫిక్స్ అయినట్లేనా?
on Dec 3, 2020
ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మాస్టర్. కోలీవుడ్ స్టార్ విజయ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. మాళవికా మోహనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి యువ సంగీత సంచలనం అనిరుధ్ బాణీలు అందించాడు. ఇటీవల విడుదలైన టీజర్.. మాస్టర్ పై మరింత ఆసక్తిని పెంచింది.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ యాక్షన్ డ్రామా.. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. 2021 పొంగల్ బరిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుందని టాక్. అంతేకాదు.. జనవరి 13ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నారని కోలీవుడ్ బజ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read