విజయ్‌తో పాటు అందరూ పోటీయే : నాగచైతన్య
on Sep 13, 2018
ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండు హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. యూత్‌లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆల్మోస్ట్ పదేళ్ల కిందట హీరోగా వచ్చిన నాగచైతన్య ఇంకా సరైన హిట్ కొట్టలేదు. అంటే... చైతూ ఖాతాలో హిట్లు లేవని కాదు. అతణ్ణి స్టార్‌గా గుర్తించేంత సక్సెస్ లేదు. అతడి స్టార్‌డమ్‌ని ఘనంగా చాటేంత సక్సెస్‌లు లేవు. నాగచైతన్యకు ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాల అండ వుంది. ఇటు అక్కినేని కుటుంబం, అటు దగ్గుబాటి కుటుంబం మూలాలు అతడికి వున్నాయి. ఇండస్ట్రీని శాసిస్తున్న రెండు కుటుంబాల వారసుడిగా వచ్చాడు. మిగతా కుటుంబాల నుంచి వారసులుగా వచ్చినవాళ్ల సినిమాలకు వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. నాగచైతన్య ఖాతాలో ఇప్పటివరకూ ఒక్క హండ్రెడ్ క్రోర్ క్లబ్ సినిమా లేదు. స్టార్ హీరోలతో కాకుండా మీడియయ్ రేంజ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. దాంతో సరైన హిట్ కొట్టాలనే ఒత్తిడి మీపై ఉంటుందా? కొత్త వస్తున్న హీరోలతో మీకు ముప్పు వుందని భావిస్తున్నారా? అని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదల సందర్భంగా నాగచైతన్య మీడియా ముందుకొచ్చాడు. అప్పుడు విజయ్ దేవరకొండ వల్ల మీకు థ్రెట్ (ముప్పు) వుందని భావిస్తున్నారా? అని ఒకరు అడిగారు.
‘‘విజయ్ దేవరకొండతో ముప్పు వుందని కాదు. తన టాలెంట్ తను నిరూపించుకున్నాడు. నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా బెటర్మెంట్ చేయాలని అనుకుంటాను. ఇండస్ట్రీలో ప్రతి నటుడు నాకు పోటీయే. ఎందుకంటే... అందరూ కొత్తగా చేస్తున్నారు. నేను ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలను చూసి ఎంజాయ్ చేశానని చైతన్య చెప్పాడు. వెంటనే మీరు అటువంటి సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్న అతడికి ఎదురైంది. తడుముకోకుండా ‘‘నేను అటువంటి పాత్రలకు సూట్ అవుతానో? లేదో? చూసుకోవాలి కాదా!’’ అని చెప్పాడు.