English | Telugu

ముద్దుకు అభ్యంతరం లేదు... వాళ్లయితే బెటర్!

on Oct 7, 2017

‘వామ్మో!...విద్యాబాలనో... నువ్వు సాధారణమైన స్త్రీవి కావమ్మ!.. వీరనారివి’.  ప్రస్తుతం బాలీవుడ్ లో అందరూ అంటున్న మాట ఇది. ఇంతకీ అంతపని ఏం చేసిందా అనుకుంటున్నారా?. నాలుగేళ్ల క్రితం సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో కలిసి‘ఘన్ చక్కర్’ అనే సినిమాలో నటించింది విద్య. సాధారణంగా ఇమ్రాన్ హష్మీ సినిమాల్లో ఉండే.. లిప్ లాక్ సీన్ ఇందులో కూడా ఉంది. పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా నెరవని విద్యా... ఆఫ్ట్రల్ లిప్ లాక్ కి భయపడుతుందా? ఇమ్రాన్ పెదాలతో తన పెదాలను కలిపేసింది. 


ఇది ఎప్పుడో జరిగిపోయిన విషయమే అయినా... మీడియా సమావేశంలో ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని తెగ సందడి చేసింది విద్యా. ఆ సీన్ చేశాక.. ఇమ్రన్ హష్మీ ఏదో సాధించేసినోడిలా ఫీలైపోయాడట. ‘మనం చేసిన ఈ పని.. మీ ఆయనకు తెలిస్తే.. ఎలా ఫీలవుతాడంటావ్?’ అని తుంటరి ప్రశ్నను విద్యాబాలన్ పై సంధించాడట. అంతే.. దానికి విద్యాబాలన్ ఇచ్చిన సమాధానానికి మనోడు ఖంగు తిన్నాడట. 


‘ఏంటి?..  నేను తీసుకునే ఈ సినిమా చెక్కే.. నా చివరి చెక్ అవుతుందనుకుంటున్నావా? నేను సినిమాలు ఆపేస్తాననుకుంటున్నావా? ఇలాంటి సీన్లు చాలామంది ఆడాళ్లతో చేశావ్ కదా. వారందరినీ ఇలాగే అడుగుతుంటావా?’ అంటూ మనోడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిందట. అప్పుడు విద్య ఎక్స్ ప్రెషన్ చూసి ఇమ్రన్ కి తడిసిపోయిందట. ఈ విషయాలన్నీ విద్యాబాలనే స్వయంగా మీడియా ముందు వెల్లడించింది.  


ఆ తర్వాత ఈ లిప్ లాక్ పైనే ఓ విలేకరి ‘ఇలా మగాళ్లతో చేశారు ‘ఓకే’. పాత్ర కోసం ఆడాళ్లతో చేయాల్సివస్తే?’ అనడిగాడట. తుంటరి ప్రశ్నలు వేసేవారికీ.. విద్య తుంటరిగానే చెబుతుంది కదా సమాధానం. అందుకే.. ఇలా చెప్పిందట. ‘ఎందుకు పెట్టుకోను.. చక్కగా ముద్దుపెట్టుకుంటాను. అది నా సహజ స్వభావం కాకపోయినా.. పాత్రకోసం చేసేస్తా’ అనీ.. ‘అయితే... వాళ్లు...పెనలోప్ క్రజ్, సల్మా హయక్, ఎమ్మాస్టోన్ అయితే.. బావుంటుంది’ అని వెటకారం ప్రదర్శించిందట. పెళ్లి చేసుకొని ఒకరి ఇల్లాలై ఉండి.. ఇలాంటి సీన్ల లో నటించడం అంటే సాధారణమైన విషయం కాదు.  పైగా ఈ సమాధానాలు ఒకటి!  అందుకే.. ఆ తెగువ చూసి బాలీవుడ్ అంతా అవాక్కైపోతోంది. మరి విద్యాబాలనా మజాకా!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here