వెంకీ -- పూరీ.. ఈ కాంబినేషన్ ఏంటండీ బాబూ..!
on Feb 20, 2017
కొన్ని కాంబినేషన్లు మరీ విచిత్రంగా అనిపిస్తాయి. ఇద్దరికీ ఎలా సెట్టవుతుందబ్బా...? అంటూ బోల్డంత ఆశ్చర్యపోతుంటాం. అలాంటి కాంబినేషన్లే టాలీవుడ్లో ఇప్పుడు వినిపిస్తున్నాయి. వెంకటేష్ - పూరి జగన్నాథ్‌లతో ఓ సినిమా రూపుదిద్దుకోనుందన్నది లేటెస్ట్ న్యూస్. వెంకీ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో. కలిసుందాం రా, పెళ్లి చేసుకొందాం, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే.. ఇలాంటి టైటిళ్లు కథలు సెట్టయిపోతాయి. అన్నట్టు ఆయనా మాస్ సినిమాలు చేశారు గానీ... అదెప్పుడో జమానాల నాటి సంగతి. పూరి జగన్నాథ్‌ది పూర్తిగా డిఫరెంట్ స్టైల్.
ఆయనది పక్కా మాస్ స్కూల్. ఇడియట్, పోకిరి, దేశముదురు.. ఇలా తిట్టే టైటిళ్లయిపోతాయి. పూరి హీరోల బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా వేరు. ఒక్కసారి నేనెంత ఎదవనో నాకే తెలీదు.. అనే డైలాగ్ వెంకీ చెబితే ఎంత ఎటకారంగా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి డైలాగులు.. పడితే.. సినిమా ఎక్కడో ఉంటుంది! వెంకీ పూరి దారిలో వెళ్లిపోయాడా?? పూరీనే వెంకీలా ఆలోచించి కథ చెప్పాడా? లేదంటే వీరిద్దరూ కలసి ఏమైనా షాకిచ్చే సినిమా తీస్తున్నారా, ఇవన్నీ ఆసక్తి కరమైన విషయాలే.
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ, వెళ్లినా మొదలయ్యేంత వరకూ, మొదలైనా విడుదలైనంత వరకూ అనుమానమే అంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్టు పూరి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తాడన్న గాసిప్పూ జోరుగా షికారు చేస్తుంది. పూరి స్టైల్ వెంకీ కాస్తో కూస్తో అందిపుచ్చుకొంటాడేమో. అదే.. బాలయ్య అనుకోండి. అది ఇంకా అరాచచమే. మరి ఈ కాంబినేషన్లు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాయో వెయిట్ అండ్ సీ.