'ఎఫ్3'కి వెంకీ రేటు పెంచేశాడా?
on Apr 8, 2020
సీనియర్ స్టార్స్‌లో వరుస హిట్లతో ఉన్న హీరో.. వెంకటేశ్. బ్యాక్ టు బ్యాక్ 'ఎఫ్2', 'వెంకీమామ' సినిమాల హిట్లతో ఆయన జోరు మీదున్నాడు. మరీ ముఖ్యంగా 'ఎఫ్2'తో కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మునుపటి మూవీ 'సైరా.. నరసింహారెడ్డి' కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. బాలకృష్ణ, నాగార్జున అయితే వరుస ఫ్లాపులతో డీలా పడ్డారు. చిరంజీవిని పక్కన పెడితే బాలయ్య, నాగ్ కంటే ఇప్పుడు వెంకీకే మార్కెట్ వాల్యూ బాగా ఉంది. ప్రస్తుతం ఆయన 'అసురన్' రీమేక్ 'నారప్ప' చేస్తున్నాడు. దానికి చాలా ముందుగానే బిజినెస్ వర్గాల నుంచి అనూహ్యమైన ఆఫర్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో 'ఎఫ్2'కి సీక్వెల్ అయిన 'ఎఫ్3'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకటేశ్. ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టును రెడీ చేశాడు. 'ఎఫ్2'లో నటించిన వెంకీ, వరుణ్ తేజ్‌తోనే ఈ సినిమానీ తియ్యాలని దర్శక నిర్మాతలు సంకల్పించారు. అయితే 'ఎఫ్2'లో తీసుకున్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే 'ఎఫ్3'కి వెంకీ భారీగా డిమాండ్ చేశారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ. 10 కోట్లకు పైగానే ఆయన రెమ్యూనరేషన్ అడుగుతున్నారని అంటున్నారు. 'ఎఫ్2'కి ఆయన తీసుకుంది రూ. 7 కోట్లే! అయినప్పటికీ వెంకీ అడిగినంత ఇచ్చేందుకు దిల్ రాజు రెడీ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి వెటరన్ స్టార్లలో వెంకీకి మంచి గిరాకీయే ఉందన్న మాట.
Also Read