బాక్సర్‌గా వరుణ్ తేజ్ నటించే సినిమా స్టార్టయ్యింది!
on Oct 10, 2019
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 10వ చిత్రం షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీని రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాగబాబు క్లాప్ కొట్టగా, చిరంజీవి సతీమణి సురేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. అంతకు ముందు అరవింద్, వెంకటేశ్, సిద్ధు ముద్ద కలిసి డైరెక్టర్‌కు స్క్రిప్ట్ అందించారు.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడిచే ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తాడని డైరెక్టర్ కిరణ్ తెలిపాడు. "ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని వరుణ్‌గారు చాలా మేకోవర్ అయ్యారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సినిమాలోని మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం" అని ఆయన చెప్పాడు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్.
Also Read