వరుణ్ తేజ్ 'గని'.. ఒక బాక్సర్ స్ట్రగుల్!
on Jan 25, 2021
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'గని'. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, టాలీవుడ్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకనటుడు మహేష్ మంజ్రేకర్ తనయ సయీ మంజ్రేకర్ ఈ సినిమాతోనే నాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 'గని' చిత్రానికి సంబంధించిన థీమ్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇండియన్ బాక్సర్స్ ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్ నేపథ్యంలో 'గని' సాగుతుందట. కథానాయకుడి పాత్ర ఓ స్ట్రగులింగ్ బాక్సర్ గా ఉంటుందని.. అలాగే ఓ స్ట్రాంగ్ సోషల్ మేసేజ్ ని సొసైటీకి అందించే ప్రయత్నంగా 'గని' ఉంటుందని టాక్. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
ఈ ఏడాది జూలై నెలలో 'గని' థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
