పవర్ స్టార్‌నే క్రాస్ చేసేశాడు
on Aug 8, 2017
పవన్ కళ్యాణ్ కి ఓవర్ సీస్ లో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన సరైన సినిమా విడుదలైతే... అక్కడున్న ఏ రికార్డూ బతకదు. అంతటి అభిమాన గణం ఉన్న కథానాయకుడు పవన్. ‘అత్తారింటికి దారేది’తర్వాత పవర్ స్టార్ కి సరైన సినిమా పడలేదనే చెప్పాలి. తెలుగు సినిమాను వంద కోట్ల క్లబ్ దాకా తీసుకెళ్లిన ఆ సినిమా... ఓవర్ సీస్ లో 1.89 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఓవర్సీస్ లో అప్పటికున్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఆ తర్వాత పవన్... సరైన సినిమా రాకపోవడతో ‘అత్తారింటికి దారేది’రికార్డులన్నీ ఓవర్సీస్లో క్రాస్ అయిపోయాయ్. ఇప్పడైతే... ఓవర్సీస్ మొదటి రెండు స్థానాల్లో ‘బాహుబలి’ సినిమాలున్నాయి. ‘అత్తారింటికి దారేది’స్థానం అయిదో ఆరో. అయితే... ఇప్పుడు ఆ స్థానం నుంచి కూడా వెనక్కి వెళ్లిపోయాడు పవర్ స్టార్ ఈ దఫా పవర్ స్టార్ ను ఇంకాస్త వెనక్కి నెట్టింది ఎవరోకాదు. అబ్బాయ్ వరుణ్ తేజే. ‘అత్తారింటికి దారేది’ 1.89 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే... అబ్బాయ్ నటించిన ‘ఫిదా’..1.91 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ విధంగా బాబాయి పవర్ స్టార్ ని అబ్బాయ్ వరుణ్ క్రాస్ చేసేశాడు. అది కూడా మూడు వారాల్లోనే. ఇప్పుడు ‘ఫిదా’ నెక్ట్స్ టార్గెట్ ‘జనతా గ్యారేజ్’. మరి దాన్ని కూడా క్రాస్ చేస్తుందేమో చూడాలి.