బన్నీ చిత్రంలో `జయమ్మ`?
on Mar 2, 2021
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కాప్ డ్రామా `క్రాక్`లో జయమ్మగా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ నెగటివ్ రోల్ లో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా పాత్రలో ఒదిగిపోయారీ చెన్నై పొన్ను. కట్ చేస్తే.. ఒకటిన్నర నెలలోపే `అల్లరి` నరేశ్ `నాంది`లో లాయర్ ఆద్యగా పాజిటివ్ రోల్ లో రాణించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో.. వరలక్ష్మికి తెలుగునాట డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలోనే.. ఓ పాన్ ఇండియా మూవీలో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలో నటించే అవకాశం దక్కిందట వరలక్ష్మికి. ఆ వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పిరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మితో సంప్రదింపులు జరిపారట దర్శకుడు శివ. కథ, పాత్ర నచ్చడంతో వరలక్ష్మి కూడా ఓకే చెప్పారని టాక్. త్వరలోనే బన్నీ - కొరటాల శివ కాంబో మూవీలో వరలక్ష్మి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. `పుష్ప`తో బన్నీ, `ఆచార్య`తో కొరటాల శివ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలు పూర్తయ్యాకే వీరిద్దరి కాంబో మూవీ.. సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.
Also Read