మన హీరోయిన్లలో తప్పతాగే మందుభామలు ఎవరంటే..?
on Mar 26, 2020
రోజులు మారాయ్! మగవాళ్లకు ఏమాత్రం, ఎంతమాత్రం తీసిపోని రీతిలో ప్రతి రంగంలో మహిళలు దూసుకు వెళుతున్నారు. తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఆఖరికి మందు తాగడంలోనూ ఏమీ తీసిపోవడం లేదు. మోడ్రన్ కల్చర్‌లో మందు తాగడం కామన్. అయితే... ఫుల్లుగా తాగమని కొందరు చెప్పుకోవడమే ఇక్కడ విశేషం.
లాక్డౌన్ కారణంగా ఇంట్లో కూర్చున్న కళాపోషకులు కొందరు కొత్త కొత్త ఆన్లైన్ ఛాలెంజ్‌లకు శ్రీకారం చుడుతున్నారు. అందులో బింగో ఛాలెంజ్ ఒకటి. యాక్సిండెంట్ అయింది, నా జుట్టు కత్తిరించుకున్నాను, పెంపుడు జంతువు ఉంది, సోలోగా ట్రావెల్ చేశా, బ్లడ్ డొనేట్ చేశా... ఇలా మొత్తం 25 బాక్సులు ఉన్నాయి. ఎవరు ఏ పని చేస్తే దాని మీద టిక్ మార్క్ పెట్టాలి. అందులో లాస్ట్‌లో 'డ్రంక్ టూ మచ్' (drank too much) అని ఒక బాక్స్ ఉంది. 'డ్రంక్ టూ మచ్' అంటే 'ఫుల్లుగా తాగాను' అని మీనింగ్. తెలుగులో పచ్చిగా చెప్పాలంటే 'తప్ప తాగాను' అని. బింగో ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసిన కొందరు హీరోయిన్లు ఆ బాక్స్ మీద టిక్ కొట్టడం విశేషం.
ఎప్పుడో ఒకప్పుడు ఫుల్లుగా తాగిన హీరోయిన్లు ఎవరంటే? ప్రియమణి. అవును... ఆమె 'డ్రంక్ టూ మచ్' బాక్స్ మీద టిక్ చేశారు. సుధీర్ బాబు సరసన 'సమ్మోహనం'లో నటించిన అదితి రావ్ హైదరి గుర్తున్నారా? మణిరత్నం 'చెలియా'లో కార్తీ సరసన నటించారు. ఆమె కూడా ఫుల్లుగా తాగారట. అలాగే, 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్రా జర్రా' ఐటమ్ సాంగ్ చేసిన డింపుల్ హయతి కూడా ఈ లిస్టులో ఉన్నారు. 'ఆర్య 2'లో సెకండ్ హీరోయిన్, 'గుంటూరు టాకీస్' ఫేమ్ శ్రద్ధా దాస్, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్, 'హుషారు' సినిమాలో హీరోయిన్ ప్రియా వడ్లమాని కూడా 'డ్రంక్ టూ మచ్' కేటగిరీలో ఉన్నారు. ఇంకెంతమంది ఈ కేటగిరీలో చేరతారో?
1. ప్రియమణి
2. అదితి రావ్ హైదరి
3. డింపుల్ హయతి
4. శ్రద్ధా దాస్
5. ప్రియాంకా జవాల్కర్
6. ప్రియ వడ్లమాని
Also Read