అదిత్ అరుణ్‌తో తమన్నా!
on Sep 16, 2020
హీరోయిన్‌గానే కాదు... ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్‌గా డ్యాన్స్ చేయడానికి కూడా తమన్నా రెడీ. అటువంటిది కాన్సెప్ట్ అండ్ క్యారెక్టర్ నచ్చితే వెబ్ సిరీస్ చేయడానికి ‘నో’ అంటారా? ‘యస్’ చెబుతారు. లెటెస్ట్‌గా ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఆమె ‘యస్’ అన్నారు. ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’, ‘గరుడవేగ’ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ఓ వెబ్ సిరీస్ చేయనున్న సంగతి తెలిసిందే. లెటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... అందులో యంగ్ హీరో అదిత్ అరుణ్ కూడా నటిస్తున్నాడు.
కార్పోరేట్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందట. ఇందులో తమన్నాది మెయిన్ లీడ్ క్యారెక్టర్. అదిత్ అరుణ్ క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే, ఇద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయట. ఒక్కొ ఎపిసోడ్ 30 నిమిషాల నిడివితో ఉంటుందని తెలిసింది. దీనికి ‘అ!’, ‘కల్కి’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మకి చెందిన స్ర్కిప్ట్స్ విల్లే కథ అందించింది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.