పెళ్లి చేసుకోను.. ఇలాగే ఉంటాను!
on Jul 14, 2020
‘‘పెళ్లి చేసుకోను. ఇలాగే (సింగిల్‌గా) ఉంటాను’’ అని ఆర్జీవీ ‘ఐస్‌క్రీమ్’ పాప, ‘బిగ్ బాస్’ ఫేమ్ తేజస్వి మదివాడ అంటోంది. జీవితంలో తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదని తేల్చి మరీ చెప్పింది. అసలు, పెళ్లి గోల ఎందుకు వచ్చిందంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏదైనా అడగండి’ అని ఆడియన్స్‌ని అడిగారు. ఒకరు ‘ఆర్ యు మ్యారీడ్? (నీకు పెళ్లి అయిందా?’ అని అడిగారు. ‘‘అవ్వలేదు. చేసుకొనే ఉద్దేశం కూడా లేదు’’ అని తేజస్వి సమాధానం ఇచ్చింది. దాంతో ఇంకొకరు ‘పెళ్లి చేసుకోవా? ఇక ఇలాగే ఉంటావా?’ అని అడిగారు. అప్పుడు ‘‘రాంగ్ పర్సన్‌ని పెళ్లి చేసుకొనే కన్నా ఇలా ఉండటమే బెటర్’’ అనేది తేజస్వి స్ట్రయిట్‌గా చెప్పింది.
రీసెంట్గా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోందీ సుందరి. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావడంతో అప్పుడప్పుడూ డ్యాన్స్‌కి చెందిన ఫొటోలూ పెడుతోంది. ఎవరో ఒకరు ‘ఇంకా కథక్ నేర్చుకుంటున్నావా అక్కా?’ అని అడిగితే... ‘‘నేర్చుకోవాలని ఉంది. కానీ, జీవితం నాతో కథక్ డ్యాన్స్ ఆడిస్తోంది. అందుకని, బ్రేక్ తీసుకున్నా’’ అని తేజస్వి సెలవిచ్చింది.