రూపాయి తీసుకోకుండా సాంగ్ చేసిందట!
on Jul 11, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాస్ట్ సినిమా 'దిల్ బేచారా'లో టైటిల్ ట్రాక్ శుక్రవారం విడుదలైంది. చూశారా? ఈ పాట వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే... ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అదీ ఒక రూపాయి తీసుకోకుండా! అవును... మీరు చదివినది నిజం! ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 'దిల్ బేచారా' టైటిల్ ట్రాక్ కొరియోగ్రఫీ చేశారు. ఎందుకు అంటే... దర్శకుడు ముఖేష్ చబ్రాకు తొలి సినిమా ఇది. అతడు అంతకు ముందు చాలా సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్గా పని చేశాడు. అతడితో ఫరాకు మంచి అనుబంధం ఉంది. దర్శకుడిగా అతడి తొలి సినిమా కాబట్టి రూపాయి తీసుకోకుండా కొరియోగ్రఫీ చేశారు. దీనికి సుశాంత్ కూడా మరో కారణం. అతడిపైనా ఫరాకు మంచి ఒపీనియన్ ఉంది. పైగా, సాంగ్ నచ్చింది.
'దిల్ బేచారా' టైటిల్ ట్రాక్ మరో ప్రత్యేకత ఏంటంటే... సింగిల్ షాట్లో సాంగ్ తీశారు. మొదట సింగిల్ షాట్ అనగానే దర్శకుడు కొంచెం ఆలోచించినా... సుశాంత్ మీదున్న నమ్మకంతో ఫరా ఖాన్ అతడిని ఒప్పించారు. సుశాంత్ అవలీలగా చేశాడని ముఖేష్ చబ్రా తెలిపారు.