సూర్య సక్సెస్‌కు జ్యోతిక చెప్పిన కారణాలు!
on Aug 7, 2020
ఓ హీరో 23 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగడం సాధారణమైన విషయం కాదు. ఆ విషయంలో సూర్య చాలా అదృష్టవంతుడు. ఆయనకు సినిమానే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు జ్యోతిక. సూర్య తొలి చిత్రం 'నెర్రుక్కు నెర్' 1997 సెప్టెంబర్‌లో విడుదలైంది. అందులో విజయ్‌తో పాటు హీరోగా నటించాడు సూర్య. ఎంచుకొనే కథలు, పాత్రలు, సినిమా సినిమాకు లుక్ మార్చడం, క్యారెక్టర్‌కు తగ్గ వేరియేషన్ ఇవ్వడం, కష్టపడే తత్వం, బాధ్యతగా మెలగడం ఇన్నేళ్లుగా ఆయన సక్సెస్‌కు కారణమని జ్యోతిక అభిప్రాయపడ్డారు.
"సూర్య సక్సెస్ వెనుక నేనున్నానని చాలామంది అంటున్నారు. ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్‌తో పాటు ఆయన పడే కష్టమూ సూర్యను ఈ స్థాయిలో నిలిపింది. ఆయన ఎదుగుదలలో అభిమానుల పాత్ర కూడా కీలకం" అని ఆమె అన్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. పాప ఎయిత్ క్లాస్, బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు. షూటింగ్ లేకపోతే స్వయంగా సూర్య కార్ డ్రైవ్ చేసుకుంటూ పిల్లల్ని స్కూల్లో దింపిన సందర్భాలెన్నో. "మా ఇద్దరి పిల్లల విషయంలో సూర్య ఏ లోటూ చెయ్యరు. ఆయన గొప్ప తండ్రి" అని భర్తను ప్రశంసల్లో ముంచెత్తారు జ్యోతిక.
Also Read