బాహుబలితో పెట్టుకుంటున్న మహేశ్..!
on Sep 29, 2016
టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న సినిమా బాహుబలి-2. ఇంత హైప్ ఉన్న మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సిన పనిలేకుండా రిలీజ్ విషయంలో క్లారిటీగా ఉంది చిత్ర యూనిట్. సమ్మర్ కానుకగా 2017 ఏప్రిల్, 28న బాహుబలిని రిలీజ్ చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ముందుగా డేట్ ఎనౌన్స్ చేసింది కేవలం ఫ్యాన్స్ గురించే కాదు మిగిలిన హీరోలు, దర్శకుల కోసం కూడా. ఎందుకంటే బాహుబలి మీద అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అందువల్ల మిగతా సినిమాలు అదే సమయంలో రిలీజ్ అయితే నిర్మాతలకు ఇబ్బంది ఉండకూడదని...జాగ్రత్త పడాలని.
.కాని ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బాహుబలిని ఢీకొట్టడానికి రెఢీ అయ్యాడు సూపర్‌స్టార్ మహేశ్, అది కూడా ఒకే రోజున. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ ప్రజంట్ మహేశ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమాను కూడా సరిగ్గా బాహుబలి విడుదల రోజున..అంటే 2017 ఏప్రిల్ 28నే రిలీజ్ చేస్తున్నట్లు మురగదాస్ ప్రకటించాడు. గతంలో బాహుబలి ద బిగినింగ్ విడుదల సమయంలో కూడా మహేశ్ శ్రీమంతుడు పోటీకి వచ్చాడు. అయితే వారం గ్యాప్‌లో రెండు పెద్ద సినిమాలు రావడం ఇండస్ట్రీకి మంచిది కాదనే ఉద్ధేశ్యంతో శ్రీమంతుడు వెనక్కుతగ్గాడు. ఇప్పుడు మళ్లీ బాహుబలి డేట్‌కే మహేశ్ సినిమాను ఎనౌన్స్ చేయడంలో..మురగదాస్ ప్లాన్ ఏంటోనని ఫిలింనగర్ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి.