సూపర్ మచ్చి... షూటింగులో చివరికొచ్చారు!
on Sep 17, 2020
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సూపర్ మచ్చి'. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇది ఫైనల్ షెడ్యూల్. దీంతో షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేయాలని ప్లాన్ చేశారు. కరోనా తరువాత ఈ సినిమా యూనిట్ సెకండ్ టైమ్ షూటింగ్ చేస్తోంది. ఫైనల్లీ ఎండ్ కి వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంది. సుశాంత్ మరణం తరువాత వార్తల్లో ప్రముఖంగా నిలిచిన రియా చక్రవర్తి మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కొన్ని రోజుల షూటింగ్ చేసిన తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుంది. రియా చక్రవర్తి స్థానంలో కన్నడ హీరోయిన్ రచితా రామ్ ను తీసుకున్నారు. కన్నడలోనూ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంచి ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ అని టాక్. మొదటి సినిమా 'విజేత'తో ఆశించిన పేరు ప్రఖ్యాతలు అందుకోలేకపోయిన కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.
Also Read