మెగాఫోన్ పట్టనున్న సునీల్?
on Dec 2, 2020
సునీల్.. కొన్నేళ్ళ క్రితం హాస్య నటుడు.. ఆపై కథానాయకుడు.. ఆ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. రీసెంట్ టైమ్స్ లో విలన్ కూడా. కట్ చేస్తే.. మరో కొత్త అవతారంలో ఈ టాలెంటెడ్ యాక్టర్ పలకరించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల సునీల్ ఓ మరాఠి మూవీని చూశారట. కథ, కథనాలు, ఆ సినిమాని చిత్రీకరించిన విధానం బాగా నచ్చడంతో తనే ఆ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే ఓ నిర్మాతకు నేరేషన్ ఇవ్వగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతుందని సమాచారం. త్వరలోనే సునీల్ డెబ్యూ డైరెక్టోరియల్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.
కమెడీయన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్.. ఇలా అన్ని రోల్స్ లోనూ అలరించిన సునీల్.. డైరెక్టర్ గానూ ఆకట్టుకుంటారేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో సునీల్ ఓ ఓటీటీ మూవీ చేస్తున్నారు. ఇందులో అతనికి జోడీగా సలోని నటిస్తోంది. మర్యాద రామన్న తరువాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది.