సందీప్‌కిషన్‌ను ముంచేసిన దర్శకుడు
on Jul 18, 2018
ఛోటా కే నాయుడు బంధువుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సందీప్ కిషన్. కానీ మొదటి సినిమా ప్రస్థానంలోనే అదిరిపోయే నటన అందించాడు. తెలుగు సినిమాకి మరో మంచి నటుడు దొరికాడన్న ఆశలు కల్పించాడు. కానీ సందీప్ దురదృష్టమో, అతను కథలు ఎంచుకునడంలో లోపమో తెలియదు కానీ... సందీప్ సినిమాలు వరుసపెట్టి బాక్సాఫీస్ దగ్గర బక్కెట్ తన్నేయడం మొదలుపెట్టాయి. ఇక భారీ అంచనాల మధ్య రిలీజైన నక్షత్రం సినిమా అయితే ప్రొడ్యూసర్లు గుండెలు బాదుకునేలా చేసింది. గుడ్డిలో మెల్లగా సందీప్‌కిషన్ తమిళనాట కొంత మార్కెట్‌ని సంపాదించుకోగలిగాడు. తమిళంతో తన మొదటి సినిమా ‘యారుడా మహేష్’ దగ్గర నుంచి తమిళనాట కాస్త ఫాలోయింగ్ ఏర్పరుచుకోగలిగాడు.
కానీ ఇప్పుడిప్పుడే అక్కడ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆ దర్శకుడు చేసిన చిమ్టా పని ఇటు సందీప్‌ను అటు నిర్మాతలనూ ముంచేసింది. గత ఏడాది సుశీందరన్ దర్శకత్వంలో ‘నెంజిల్ తునివిరుండాల్’ అనే సినిమా రిలీజైంది. ఈ సినిమా నిదానంగా పుంజుకుంటోంది అనే సమయానికి అందులో ఓ 20 నిమిషాలు కోసిపారేశాడు దర్శకుడు. మళ్లీ ఏం ఆలోచన వచ్చిందో ఏమో ఇంకో రెండు రోజులాగి అసలు సినిమానే ఎత్తేశాడు. సినిమాలో చిన్నా చితకా మార్పులు చేసి మళ్లీ రిలీజ్ చేస్తానని సెలవిచ్చాడు. దాంతో నిర్మాత కాస్తా నిండా మునిగిపోయాడు. ఇక సందీప్ సంగతి చెప్పేదేముంది!
Also Read