రాజమౌళి ఫ్యామిలీ సేఫ్.. అందరికీ కొవిడ్ టెస్ట్‌లో నెగటివ్!
on Aug 12, 2020
డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి, ఆయన కుటుంబం కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. బుధవారం టెస్ట్‌లో అందరికీ నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆయన వెల్లడించారు. "రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది. ఎలాంటి లక్షణాలు లేవు. ఆ విషయం రూఢి చేసుకోడానికి టెస్ట్ చేయించుకున్నాం. మా అందరికీ నెగటివ్ వచ్చింది. ప్లాస్మా డొనేషన్ చేయడానికి అవసరమైన యాంటీబాడీస్ డెవలప్ కావాలంటే ఇప్పట్నుంచీ మూడు వారాల పాటు వెయిట్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు." అని రాజమౌళి ట్వీట్ చేశారు.
తనతో సహా కుటుంబమంతా కొవిడ్-19 టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని జూలై 29న ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తమకేమీ లక్షణాలు కనిపించడం లేదనీ, అంతకు ముందు స్వల్పంగా ఫీవర్ కనిపించిందనీ ఆయన చెప్పారు. వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నట్లు తెలిపారు. సరిగ్గా రెండు వారాలు క్వారంటైన్లో ఉన్నవారంతా టెస్టులో నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read