English | Telugu

'ఆర్ఆర్ఆర్'‌ అక్టోబ‌ర్ 13 విడుద‌ల‌

on Jan 25, 2021

 

ఇదివ‌ర‌కు అనుకున్న‌ట్లు అక్టోబ‌ర్ 8న కాకుండా అక్టోబ‌ర్ 13న 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుద‌ల‌వుతోంది. య‌స్.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌లో ఉంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

'ఆర్ఆర్ఆర్' మూవీ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చ‌ర‌ణ్ గుర్రంపై దౌడు తీస్తుంటే, తార‌క్ బైక్‌ను న‌డుపుతున్నాడు. ఒక‌రికొక‌రు పోటీ పెట్టుకున్న‌ట్లుగా వేగంగా పోతున్నారు. ఈ పిక్చ‌ర్‌తో పాటు, "This October 13, witness Fire and Water wave come together as a FORCE that has never been experienced before. The biggest collaboration in Indian cinema is set to deliver a memorable experience!!! THE RIDE BEGINS..." (ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని విధంగా నిప్పు, నీరు క‌లిసి ఒక శ‌క్తిగా వ‌స్తుండ‌టాన్ని ఈ అక్టోబ‌ర్ 13న చూడ‌బోతున్నాం. ఇండియ‌న్ సినిమాలో బిగ్గెస్ట్ కొలాబ‌రేష‌న్ ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. రైడ్ మొద‌లవుతోంది.) అంటూ రాసుకొచ్చారు.

అలియా భ‌ట్‌, ఒలీవియో మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌క‌ని, శ్రియ‌, రే స్టీవెన్స‌న్‌, అలీస‌న్ డూడీ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి యం.యం. కీర‌వాణి, సెంథిల్ కుమార్‌, వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, సాబు సిరిల్‌ లాంటి దిగ్గ‌జ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు.

ఫిక్ష‌న‌ల్‌ పీరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించార‌నేదే క‌థాంశం. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.