శ్రీకాంత్ అడ్డాలకు మెగా క్యాంప్ లో చోటు..!
on May 26, 2016
ఒక సినిమా యావరేజ్ గా ఆడిందంటే, ఆ డైరెక్టర్ కు మరో కొత్త సినిమా చేయాలంటే, తల ప్రాణం కాళ్లకు వస్తుంది. అలాంటిది ఒక డిజాస్టర్ ను ఎకౌంట్ లో వేసుకున్న రోజుల వ్యవధిలోనే మరో సినిమాకు దర్శకుడిగా సెట్ అవడమంటే మాటలు కాదు. అదృష్టం శ్రీకాంత్ అడ్డాల విషయంలో వర్కవుట్ అయింది. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ ను తీసిన శ్రీకాంత్ కెరీర్ ఇరకాటంలో పడిందని, మళ్లీ లేవడానికి చాలా టైమే పడుతుందని సినీ జనాలు అనుకున్నారు. అయితే మెగా క్యాంప్ కు అతనిలో ఏం కనబడిందో కానీ, తమకు ఒక సినిమా చేయమని శ్రీకాంత్ తో మాట్లాడుతున్నారట. ఇప్పటికే మెగా క్యాంప్ లో ముకుంద సినిమా చేసి, వరుణ్ ను యావరేజ్ సినిమాతో లాంఛ్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. సినిమా యావరేజ్ అయినా, వరుణ్ కు మాత్రం మంచి నటుడనే పేరును తీసుకొచ్చిందా సినిమా. బడ్జెట్ కంట్రోల్ లో ఉండి ఉంటే బ్రహ్మోత్సవం కూడా సేఫ్ గానే ఎస్కేప్ అయి ఉండేది. స్టోరీ పై గ్రిప్ లేకుండా సినిమా షూట్ కు వెళ్లిపోవడం, లెక్కలేనంత మంది క్యాస్టింగ్, భారీ సెట్లు లాంటివన్నీ మూవీకి దెబ్బకొట్టాయి. ఇక మెగా క్యాంప్ విషయానికొస్తే, మంచి ఫ్యామిలీ సినిమాగా సాయి ధరమ్ లేదా చెర్రీ తో శ్రీకాంత్ కు సినిమా పడే అవకాశాలున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ లో సింపుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలని వాళ్లు చెప్పిన దానికి శ్రీకాంత్ కూడా ఒకే చెప్పేశాడంటున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈసారైనా శ్రీకాంత్ కాస్త మంచి కథతో సినిమా తీస్తే అతని కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందనడంలో సందేహం లేదు.