వర్మ కు ఆ ఆలోచన లేకపోయినా, బోనీ కి ఉంది
on Mar 9, 2018
శ్రీదేవి అకాల మరణం భారతీయులందరినీ షాక్ కి గురి చేసింది. ఇక ఆమె కుటుంబ సభ్యులయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీదేవిని ఎంతగానో అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీస్తాడనే వచ్చాయి. ఈ రూమర్స్ ని తిప్పి కొడుతూ, తనకు శ్రీదేవి బయోపిక్ తీసే ఆలోచన లేదని, ఎందుకంటే శ్రీదేవి అంతటి సౌందర్య రాశి మరియు నటిని పట్టుకోవడం కష్టం అని వివరించాడు వర్మ.
అయితే, శ్రీదేవి భర్త బోనీ కపూర్ మాత్రం ఒక డాక్యుమెంటరీ తీసే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందుకు గాను, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ని సంప్రదించాడని వార్తలు వస్తున్నాయి. అన్నీ సజావుగా జరిగితే, త్వరలోనే శ్రీదేవి పైన డాక్యుమెంటరీ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట బోనీ. అయితే, ఈ డాక్యుమెంటరీ ని ఎలా తీస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. వేరే ఎవరయినా ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసి షూట్ చేస్తారా, లేక శ్రీదేవికి సంభందించిన పాత ఫుటేజ్ వాడుకొని చేస్తారా అని తెలియాల్సి ఉంది. శ్రీదేవి తో మిస్టర్ ఇండియా తీసిన శేఖర్ కపూర్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడట.