అంటే శ్రీరెడ్డి ఇప్పటిదాకా చెప్పిందంతా కట్టుకదేనా...
on Apr 4, 2018
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన చుట్టూ తిరిగేవాడని, వీడియో కాల్స్ కోసం పడి చచ్చేవాడని, పచ్చి మోసగాడని తీవ్రమయిన విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. గత కొంత కాలంగా, టాలీవుడ్ లో జరుగుతున్న చీకటి వ్యవహారాలూ బయటపెడతానంటూ రోజుకో కథతో వస్తున్న శ్రీ రెడ్డి క్లీన్ ఇమేజ్ ఉన్న శేఖర్ కమ్ముల ని టార్గెట్ చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ పరిణామంతో షాకయినా శేఖర్ కమ్ముల, శ్రీ రెడ్డి అంటే ఎవరో అసలు తనకు తెలియదని, అసలు ఆమెని ఇంతకు ముందెన్నడూ కనీసం కలవలేదని అన్నాడు. ఆమె క్షమాపణలు చెప్పకపోతే, లీగల్ ఆక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలతో చతికిలపడ్డ శ్రీ రెడ్డి, ప్లేట్ ఫిరాయించింది. తాను రోజు తన అభిమానుల్ని తృప్తి పరచడానికి బెడ్ టైం స్టోరీస్ చెబుతానని, అందులో ఇది ఒకటి అని. శేఖర్ కమ్ముల ని ఏం ఫీల్ అవ్వొద్దని. అసలు ఏం చేయనప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారని అంది. మొత్తానికి, తాను చేసేదంతా హంబక్ అని కలరింగ్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు, క్లీన్ ఇమేజ్ ఉన్న శేఖర్ కమ్ముల ని టార్గెట్ చేయడమెందుకు. కల్పిత కథల్లో మంచి వ్యక్తుల పేర్లు పెట్టడమెందుకు అని శ్రీ రెడ్డి పైన విమర్శలు వస్తున్నాయి.