మహాశివరాత్రికి శర్వానంద్ శ్రీకారం?
on Jan 22, 2021
శతమానం భవతి తరహాలో పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంతో యువ కథానాయకుడు శర్వానంద్ చేస్తున్న చిత్రం శ్రీకారం. నూతన దర్శకుడు బి. కిషోర్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శర్వానంద్ రైతు పాత్రలో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. అతనికి జోడీగా గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాని మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే విడుదల తేదిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఇంప్రెసివ్ గా ఉండడంతో.. సినిమాపై మంచి బజ్ నెలకొంది.
మరి.. పడి పడి లేచె మనసు, రణరంగం, జాను చిత్రాలతో వరుస పరాజయాలు చూసిన శర్వానంద్.. ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
