English | Telugu

మహేశ్ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో చూడండి!

on Aug 9, 2017

ఒకే రంగంలో పనిచే్స్తున్నవారికి ఇగో ప్రాబ్లమ్స్ సహజం. కానీ... కొందరి యాటిడ్యూడ్ వల్ల ‘ఇగో’లన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయ్. అంతర్ముఖుల్ని కూడా అభిమానులుగా మార్చేసుకునే నేర్పు వారి సొంతం. అలాంటి వాడే మహేశ్ బాబు. కోట్లాది అభిమానులున్న ఈ సూపర్ స్టార్... తన తోటి సినిమా వాళ్లను కూడా ఇట్టే బుట్టలో వేసేసుకున్నాడు. 

మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘స్పైడర్’ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ బుధవారం ‘స్పైడర్ ’టీజర్ ని విడుదల చేశారు. వానల వల్ల చల్లబడ్డ వాతావరణాన్ని సూపర్ స్టార్ ‘స్పైడర్’టీజర్ ఒక్కసారిగా వేడెక్కించేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘స్పైడర్’ టాపిక్కే. ఈ సందర్భంగా మహేశ్ గురించి పరిశ్రమలో తన తోటి వారు ఏమనుకుంటున్నారో సరదాగా చూద్దాం. 


సమంత :- 
ఆ నవ్వు చాలండీ... మన కళ్లన్నీ ఆటోమేటిగ్గా ఆయన వైపు తిరిగిపోతాయి. అంత అందంగా నవ్వుతారాయన. నిజంగా వర్క్ విషయంలో ఆయనంత సిన్సియర్ ని నేను ఎక్కడా చూడలేదు. తెలుగులో నా ఫేవరెట్ కో స్టార్ అంటే మాత్రం కచ్చితంగా మహేశ్ సార్ పేరే చెబుతా. ‘స్పైడర్’ టీజర్ చూశా. నిజంగా అమేజింగ్. సూపర్ హిట్ గ్యారెంటీ. 


కార్తీ:-
మహేశ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. చెన్నయ్ లో కలిసి చదువుకున్నాం. తనను ఇప్పుడు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. బొద్దుగా ఉండేవాడు. ఇంత సన్నగా ఎలా మారిపోయాడా? అని. తను హీరో అవుదామని అనుకున్నప్పట్నుంచీ చాలా కష్టపడ్డాడు. ఎక్కువగా రన్నింగ్ చేసేవాడు. ఇక యాక్టింగ్ విషయానికొస్తే... నేను తనకు పెద్ద ఫ్యాన్. తెలుగులో నాకు బాగా నచ్చిన హీరో మహేశ్. హీ ఈజ్ ఏ గ్రేట్ సూపర్ స్టార్. ‘స్పైడర్’ తమిళంలో కూడా గ్రాండ్ సక్సెస్ గ్యారెంటీ. 


డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్ (తమిళ్):-
మహేశ్ కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు. దక్షిణభారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయనంటే చచ్చిపోతారు. తమిళ నాడులో కూడా మహేశ్ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ‘స్పైడర్’ కోసం అందరూ వెయిటింగ్. 


హీరో రామ్:- 
తెలుగు సినీరంగంలో ఫైనెస్ట్ యాక్టర్, అందగాడు మహేశ్ గారు మాత్రమే. ఆయన్ను అభిమానించని వాళ్లు ఎవరుంటారు? ‘స్పైడర్’కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. 


కాజల్:- 
మహేశ్ ఒక టైమ్ మిషిన్. ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉంటారు. నిజంగా హీ ఈజ్ గ్రేట్. ఆయనతో బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం సినిమాలు చేశాను. వండర్ ఫుల్ ఎక్స్ పిరియన్స్. అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ మహేశ్ సొంతం. నవ్వించడం మొదలుపెడితే... ఇక ఆగలేం. ‘స్పైడర్’ టీజర్ నిజంగా అమేజింగ్ అనిపించింది. 


పోసాని కృష్ణమురళి:- 
పోలికల్లోనే కాదు గుణంలో కూడా మహేశ్ అచ్చం కృష్ణగారే. కృష్ణగారిలోని మంచి తనం, కష్టపడే తత్వం అన్నీ మహేశ్ లో కనిపిస్తాయి. అందుకే నాకు మహేశ్ అంటే ఇష్టం. తను ఇప్పడు నంబర్ వన్ హీరో. కానీ... సెట్ లో ఒక బోయ్ లా ఉంటాడు. ‘నేనొస్తే లెగవాలి... నేనొస్తే సలామ్ చేయాలి... నన్నందరూ గౌరవించాలి... నేనో డిక్టేటర్ నీ, రూలర్ నీ’ అనే మెంటాలిటీతో ఉంటారు చాలామంది హీరోలు. కానీ మహేశ్ చాలా సాధారణంగా ఉంటాడు. అందుకే మహేశ్ అంటే నాకిష్టం. 


రాజమౌళి:- 
సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి.. మన స్టార్ హీరోలకు సమానంగా ఏలాగైతే.. ఇక్కడ కూడా  స్టార్ డమ్ ఉందో... మన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా తమిళ, మలయాళ భాషల్లో అక్కడి స్టార్స్ కి సమానంగా స్టార్ డమ్ ఉంది. ఇప్పుడున్న హీరోల్లో పక్క భాషల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్న తొలి హీరో మహేశ్ బాబే.  మిగిలిన హీరోలు కూడా మహేశ్ దారిన నడవాలని కోరుకుంటున్నా. 


పూరీ జగన్నాథ్:- 
మహేశ్ తో పనిచేయడం మత్తు లాంటిది. అతనో ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్ కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేశ్. మనం ఒకటనుకుంటే... దానికి పదొంతులు చేస్తాడు. ప్రతి రోజూ డైరెక్టర్ హ్యాపీగా ఇంటికెళ్లి నిద్రపోవచ్చు. అంత మంచి నటుడు. 


ఆది పినిశెట్టి:-
మహేశ్ గారు కనిపిస్తే అడగాలనుంది. ఫార్టీ ప్లస్ లో కూడా ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారని. వయసు పెరగే కొలదీ శరీరంలో ఏదో ఒక మార్పులొస్తాయి. కానీ మహేశ్ గారిలో వయసు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. నిజంగా సౌత్ లో ఉన్న గ్రేట్ యాక్టర్స్ లో మహేశ్ ఒకరు. నో డౌట్. ‘స్పైడర్’ టీజర్ సూపర్. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. నేను కూడా ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా. 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here