‘స్పైడర్’ అదిరిందట.. పండగ చేసుకోండి!
on Sep 26, 2017
‘స్పైడర్’ అదిరిపోయిందంటండోయ్...అభిమానులకే కాదు... సగటు ప్రేక్షకుడు కూడా పండగ చేసుకునేలా సినిమా ఉందట. హిట్ గ్యారెంటీ అని చెబుతున్నాడూ... విదేశాల్లో ఈ సినిమా సెన్సార్ స్క్రీనింగ్ కి హాజరైన సినీ విశ్లషకుడు ఉమైర్ సింధూ.
సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న ఓ దుర్మార్ఘుడ్ని తుదముట్టించే అడ్వంచరస్ డ్రామాతో ఈ సినిమా రూపొందిందట. విజువల్ ఎఫెక్ట్స్ అయితే.. కళ్లు తిప్పుకోనీయవట. స్క్రిప్ట్ అద్భుతంగా రాసుకున్నారని ఉమైర్ సింధూ అన్నారు. అడ్వంచరస్ మూవీస్ లో లాజిక్కులు వెతక్కూడదు. కానీ... ఈ సినిమాలో ప్రతి సన్నివేశం లాజికల్ గానే ఉంటుందని ఉమైర్ చెప్పడం విశేషం. ప్రథమార్ధం కాస్త నిదానంగా ఉంటుందట. ద్వితాయార్థం హంటింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుందట. ఆడియన్స్ అద్భుతానికీ, ఆశ్చర్యానికి లోనయ్యేలా సన్నివేశాలు ఉంటాయట.
పాత్ర రిత్యా మహేశ్ ఇందులో కాస్త సీరియస్ గా కనిపిస్తాడట. ఆయన నుంచి కోరుకునే కామెడీని మాత్రం ఇందులో ఆశించొద్దని తేల్చేశాడు ఉమర్. అయితే... కండబలం, గుండెబలం ఉన్న తెలివైన వాడిగా ఇందులో మహేశ్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఉమర్ తెలిపారు. రకుల్ చాలా అందంగా కనిపించిందట.
సాంకేతికంగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సంతోశ్ శివన్ కెమెరా, హరీస్ జైరాజ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని ఉమర్ చెప్పారు. ఓవరాల్ గా తేలిగ్గా విజయవంతయ్యే కథను ఎంచుకొని దర్శకుడు మురుగదాస్ సేఫ్ గేమ్ ఆడాడనీ... ‘స్పైడర్’ విజయం తథ్యం అని తేల్చి చెప్పేశాడు ఉమైర్ సింధూ.
అభిమానులూ ఇంకెందుకు ఆలస్యం పండగ చేసుకోండీ.