విజయ్ చిత్రానికి శివకార్తికేయన్ సాహిత్యం
on Mar 4, 2021
కోలీవుడ్ స్టార్ విజయ్ - టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ సాహిత్యమందించబోతున్నట్లు తెలిసింది. తమిళనాట అగ్ర యువ కథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్న శివ.. అనతికాలంలోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు నిర్మాణం, గానం, సాహిత్యం.. ఇలా పలు విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారాయన.
ఇక నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన `కొలమావు కోకిల`తోనే గీతరచయితగా తొలి అడుగేసిన శివ కార్తికేయన్.. ఆపై `గుర్ఖా`, `నమ్మ వీట్టు పిళ్ళై`, `ఆదిత్య వర్మ` చిత్రాలకు ఒక్కో పాట చొప్పున సాహిత్యమందించారు. అంతేకాదు.. తనే కథానాయకుడిగా నెల్సన్ రూపొందించిన `డాక్టర్` చిత్రంలో రెండు పాటలకు లిరిక్స్ రాశారు.
మరి.. విజయ్ సినిమాకి శివకార్తికేయన్ సాహిత్యం ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, `విజయ్ 65`గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించనున్నారు.
Also Read