సింగర్స్ నేహా కక్కర్, రోహన్‌ప్రీత్ పెళ్లి చేసుకున్నారు!
on Oct 24, 2020
అన్ని వదంతుల తర్వాత, 2020 అక్టోబర్ 10న తోటి గాయకుడు రోహన్‌ప్రీత్ సింగ్‌తో తన అనుబంధం విషయాన్ని ప్రకటించింది పాపులర్ సింగర్ నేహా కక్కర్. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రోహన్‌ప్రీత్‌తో ఉన్న ఓ క్యూట్ పిక్చర్‌ను ఆమె పోస్ట్ చేసింది. దాంతో పాటు "నువ్వు నావాడివి రోహన్‌ప్రీత్ సింగ్. #NehuPreet." అని రాసింది. రోహన్‌ప్రీత్ కూడా అదే పిక్చర్‌ను షేర్ చేసి, "Meet My Zindagi! #NehuPreet". అని రాశాడు.
అప్పట్నుంచీ నేహా, రోహన్‌ప్రీత్ ఇద్దరూ తమ అందమైన ఫొటోలతో అభిమానులకు కనువిందు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు అక్టోబర్ 24న ఆ ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలోని గురుద్వారాలో జరిగిన వారి పవిత్ర వైవాహిక వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నేహా కక్కర్, రోహన్‌ప్రీత్ సింగ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు మనం చూడొచ్చు. ఆ ఇద్దరి కెమిస్ట్రీ చూస్తే వారితో మనం ప్రేమలో పడకుండా ఉండలేం. అయితే గురుద్వారాలో నేహ, రోహన్‌ప్రీత్ వివాహ క్రతువుకు సంబంధించిన లేటెస్ట్ వీడియోలు ప్రేమ, వివాహంలోని స్వచ్ఛతను తెలియజేస్తాయి. ఆ వీడియోలలో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక ఆచారాలను పాటిస్తూ నిల్చున్న ఆ జంటను మనం చూడొచ్చు.
అంతకు ముందు తన మెహందీ వేడుకలో కాబోయే భర్త రోహన్‌ప్రీత్‌తో కలిసున్న కొన్ని అందమైన పిక్చర్లను నేహా కక్కర్ షేర్ చేసింది. వాటిలో ఆకుపచ్చ రంగుల్లోని దుస్తులతో ఆ ఇద్దరూ ముచ్చటగా కనిపిస్తున్నారు. ఇంకో పిక్చర్లో మెహందీ వేసుకొని ఉన్న చేతులను చూపిస్తోంది నేహ. ఉంగరం వేలికి 'రోహన్' అనే పేరు స్పష్టంగా కనిపిస్తుండటం గమనించవచ్చు.
Also Read