సునీత సంతోషానికి హద్దులు లేవు.. ఈ ఫొటోలే సాక్ష్యం!
on Jan 22, 2021
గాయని సునీత జనవరి 9న మీడియా రంగంలో ఉన్న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌లో నిశ్చితార్ధం జరిగిన దగ్గర్నుంచీ సునీత ఎంత ఆనందంగా ఉన్నారో పలు పొటోలు, వీడియోల ద్వారా మనం చూస్తూ వచ్చాం. కొంతమంది ఆమె అంత సంతోషంగా ఉండటం చూసి తట్టుకోలేక రకరకాలుగా మాట్లాడుకున్నారు. పెళ్లీడు పిల్లలు ఇద్దరు ఉండగా, 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకుంటూ ఆ ఆనందం ఏమిటి? అన్నవాళ్లున్నారు.
ఏదేమైనా రెండో పెళ్లి సునీత జీవితంలో చాలా ఆనందాన్ని తెచ్చిందనే మాట తిరుగులేని నిజం. మరోసారి ఆ విషయం ఆమె లేటెస్ట్‌గా షేర్ చేసిన ఫొటోలతో స్పష్టమైంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా శుక్రవారం కొన్ని పిక్చర్స్‌ను ఆమె షేర్ చేశారు. ప్రతి పిక్చర్‌లో ఆమె ముఖం పెళ్లి తెచ్చిన కళతో వెలిగిపోతోంది. నవ్వు ఆమె ముఖానికి మరింత అందం తెచ్చింది.
తమ గార్డెన్‌లో పెరిగిన వంకాయలను కోసి చేతులో పట్టుకొని వాటిని కూడా చూపిస్తూ ఫొటో దిగారు సునీత. రెండు చేతులకూ నిండుగా గాజులు, గోరింటాకు కనిపిస్తున్నాయి. ఆ పిక్చర్స్‌కు "It's never too late.. Never too late to start over, never too late to be happy (ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు .. మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు, ఆనందంగా ఉండటానికి ఎప్పుడూ ఆలస్యం కాదు.)" అని క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
