‘చంద్రముఖి 2’ గురించి సిమ్రాన్ క్లారిటీ
on Jun 2, 2020
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘చంద్రముఖి’ తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘చంద్రముఖి’ తీసిన పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా ఆయన ‘నాగవల్లి’ తీశారు. ఇప్పుడు తీయబోయే సినిమాకి, ఆ సినిమాకి సంబంధం లేదట. పూర్తిగా కొత్త కథతో ఈ సినిమా తీస్తున్నారట. ఇక, అసలు మేటర్లోకి వస్తే...
రాఘవ లారెన్స్ కథానాయకుడిగా పి. వాసు తెరకెక్కించనున్న ‘చంద్రముఖి 2’లో సిమ్రాన్ నటించనున్నారని తమిళనాట ఓ వార్త చక్కర్లు కొట్టింది. ‘చంద్రముఖి’లో జ్యోతిక అద్భుతంగా నటించారు. సీక్వెల్లో ఆమె స్థానంలో సిమ్రన్‌ని తీసుకున్నారని ఓ పుకారు షికారు చేసింది. దాంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇది ఫేక్ న్యూస్. అభిమానులను డిజప్పాయింట్ చేస్తున్నందుకు సారీ. అటువంటి పాత్రలో నటించమని నన్ను ఎవరూ అప్రోచ్ కాలేదు’’ అని సిమ్రన్ ట్వీట్ చేశారు. అదీ సంగతి. కొత్త చంద్రముఖిగా ఎవర్ని ఎంపిక చేస్తారో?
Also Read