విజయ్, వరుణ్ బాక్సింగ్ స్టోరీస్.. 3 కామన్ ఫ్యాక్టర్స్!
on Mar 30, 2020
విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్.. యువతరంలో ఈ ఇద్దరు కథానాయకులకు కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్. అలాంటి విజయ్, వరుణ్.. ఇద్దరు కూడా ప్రస్తుతం ఒకే నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాక్సింగ్ స్టోరీస్‌తోనే రాబోతున్న వీరి లేటెస్ట్ వెంచర్స్‌కి సంబంధించి మూడు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
ఆ కామన్ ఫ్యాక్టర్స్ వివరాల్లోకి వెళితే..
కామన్ ఫ్యాక్టర్ 1: విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ నటిస్తున్న 'బాక్సింగ్' బ్యాక్ డ్రాప్ మూవీస్.. ఇద్దరికీ కూడా కెరీర్లో పదో చిత్రాలు కావడం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'VD 10' (పరిశీలనలో ఉన్న టైటిల్ 'లైగర్')గా తెరకెక్కుతుంటే.. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న 'బాక్సర్' (పరిశీలనలో ఉన్న టైటిల్) 'VT 10'గా రాబోతోంది.
కామన్ ఫ్యాక్టర్ 2: అటు 'VD 10', ఇటు 'VT 10'.. రెండు కూడా మదర్ సెంటిమెంట్ తోనే తెరకెక్కుతున్న చిత్రాలే. 'VD 10'లో విజయ్ దేవరకొండకి తల్లిగా సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ నటిస్తుంటే.. 'VT 10'లో వరుణ్ తేజ్‌కు అమ్మగా మరో మాజీ కథానాయిక నదియా నటిస్తోంది. విజయ్‌కి తల్లిగా రమ్య, వరుణ్‌కు అమ్మగా నదియా నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కామన్ ఫ్యాక్టర్ 3: 'VD 10'లో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండగా.. 'VT 10'లో వరుణ్ తేజ్ కి జంటగా సయీ మంజ్రేకర్ దర్శనమివ్వనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అటు అనన్య, ఇటు సయీకి ఇవే తొలి తెలుగు చిత్రాలు కావడమే కాకుండా ఇద్దరు కూడా బాలీవుడ్ ప్రముఖుల వారసులు కావడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే గారాల పట్టి అనన్య కాగా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకనటుడు మహేశ్ మంజ్రేకర్ ముద్దుల తనయ సయీ మంజ్రేకర్.
మరి, ముచ్చటగా మూడు కామన్ ఫ్యాక్టర్స్‌తో తక్కువ గ్యాప్‌లోనే రానున్న విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్.. తమ స్పోర్ట్స్ డ్రామాలతో ఏ స్థాయిలో రంజింపజేస్తారో చూద్దాం.