అల్లు అర్జున్ సరైనోడు కలెక్షన్స్...!
on May 31, 2016
అల్లు అర్జున్ స్టామినాను ప్రూవ్ చేస్తూ వందకోట్ల షేర్ వైపు పరుగులు తీస్తోంది సరైనోడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ అంచనాలకు మించిన రాణించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. మొదటిరోజే సినిమా బాలేదని పెదవి విరిచిన వాళ్లందరికీ సరైనోడు లాంగ్ రన్ చూస్తే షాక్ తగులుతోంది. రిలీజై 40 రోజులు దాటేసినా ఇంకా స్ట్రాంగ్ రన్ లో ఉన్నాడు సరైనోడు. వచ్చే వారానికే టాలీవుడ్ టాప్ 3లో ఈ సినిమా చేరిపోతుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు. కేరళ కలెక్షన్లు లెక్కవేయకుండా, ఇప్పటికే 90 కోట్ల షేర్ ను రీచ్ అయిపోయింది సరైనోడు. కేరళలో కూడా మూవీ రన్ పూర్తైతే ఆల్ టైం కలెక్షన్ లిస్ట్ లో బాహుబలి, శ్రీమంతుడు తర్వాతి ప్లేస్ లో సరైనోడు నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ సరైనోడు కలెక్షన్స్..(కోట్లలో)
నైజాం 19.30
సీడెడ్ 11.00
వైజాగ్ 8.00
గుంటూరు 5.30
తూర్పు గోదావరి 5.15
పశ్చిమ గోదావరి 4.40
కృష్ణా 4.05
నెల్లూరు 2.30
ఓవర్సీస్ 5.15
కర్ణాటక 8.00
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60
శాటిలైట్ రైట్స్(తెలుగు హిందీ కలుపుకుని) 16.00
మొత్తం 90.25