పీడకలలు.. నిద్రలేమి.. సంజన మానసిక సమస్యలు!
on Mar 2, 2021
శాండల్‌వుడ్ నటి సంజన గల్రానీ `బుజ్జిగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన తరువాత కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. నటిగా తెలుగులో పెద్దగా గుర్తింపుని, అవకాశాల్ని తెచ్చుకోలేకపోయింది. అయితే ఇటీవల శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
అందులో రాగిణి దివ్వేదితో పాటు సంజన గల్రానీ పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరికి వీరిని ఆరెస్ట్ చేసి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకి తరలించారు. నెలరోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో వున్న సంజన ఎట్టకేలకు బెయిల్ లభించడంతో బయటికి వచ్చేసింది. ప్రస్తుతం బెంగళూర్‌లోని తన నివాసంలో వుంటున్న సంజన ప్రస్తుతం మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందట.
తనకు పీడకలలు వస్తున్నాయని, నిద్ర లేమితో బాధపడుతున్నానని, రెండు గంటలు మినహా తాను నిద్రపోవడంలేదని సంజన సోషల్ మీడియాలో వెల్లడించింది. దేవుడిపై భారం వేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసిన సంజన డబ్బు, భౌతిక వాదంపై తన ద్వేషాన్ని వెళ్లగక్కింది.