నేను ఎన్నారైని కాదు.. గోల్డ్ షాప్ లో పనిచేశా..!
on Apr 22, 2017
తాను చేసిన తప్పును బహిరంగ బప్పుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇంతకీ అంత పెద్ద తప్పు సంపూర్ణేష్ బాబు ఏం చేశాడు అనుకుంటున్నారా..? అదేంటో మీరే చదవండి... తాను ఒక ఎన్నారైనని... విదేశాల్లో బాగా సంపాదించి, ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానిపై ఓ క్లారిటీ ఇచ్చాడు సంపూ. ఆ ఇంటర్య్వూలో చెప్పిందంతా అబద్దమని, తనను క్షమించాలని ఇటీవల తాను ఇచ్చిన మరో ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాదు తన అసలు పేరు నరసింహాచారి అని... సినిమాల్లోకి రాక ముందు సిద్ధిపేటలో ఓ బంగారం దుకాణంలో పని చేసేవాడినని చెప్పాడు. తాను ఇప్పటికీ సిద్దిపేటలోనే ఉంటానని... సినిమా షూటింగ్ ఉన్నప్పుడే హైదరాబాదుకు వస్తుంటానని తెలిపాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. మరి అప్పుడు అలా ఎందుకు చెప్పాడో.. ఇప్పుడు నిజం ఎందుకు చెప్పాడో సంపూకే తెలియాలి.
Also Read