సంపూ డైలాగ్ కు మెగాస్టార్ ఫ్లాట్..!
on May 30, 2016
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట ట్రైలర్ కు ఇప్పటికే భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. స్త్రీ గురించి సంపూ చెప్పిన బ్రీత్ లెస్ డైలాగ్ అందరూ వావ్ అంటున్నారు. ఇప్పుడు ఈ వావ్ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఆ సమయానికి అక్కడే ఉన్న సంపూర్ణేష్ బాబుకు మెగాస్టార్ ను కలిసే అవకాశం కలిగింది. ఆ సందర్భంగా తన మొబైల్ లో కొబ్బరి మట్ట ట్రైలర్ ను చూపించాడు సంపూ. ట్రైలర్ చూసినంత సేపూ మెగాస్టార్ నవ్వుతూనే ఉన్నారట. కేవలం నవ్వడమే కాకుండా, బ్రీత్ లెస్ గా సంపూ చెప్పిన డైలాగ్ కు ఫిదా అయిపోయి మనోడ్ని పొగిడేశారట. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై ఈ విశేషాల్ని తన ట్విట్టర్లో పంచుకున్నాడు సంపూ. సినిమా విషయానికొస్తే, మూవీలో మూడు రోల్స్ చేస్తున్నాడు సంపూ. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే ఈ మూడు పాత్రలు వేటికవే వెరైటీగా ఉంటాయని మూవీ టీం చెబుతున్నారు. రూపక్ రొనాల్డ్ సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ త్వరలోనే మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.