నెట్లో ఇరగదీస్తున్న సంపూర్ణేష్ బాబు టీజర్..!
on May 24, 2016
అదృష్టం బాగుండి ఇండస్ట్రీలోకి ఎంటరైనా, ఆ తర్వాత మాత్రం తన టాలెంట్ తో, హార్డ్ వర్క్ తో ఎంతో మంది అభిమానుల్నిసంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. అభిమానులంతా ముద్దుగా సంపూ అని పిలుచుకనే ఈ బర్నింగ్ స్టార్ లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. స్త్రీ గురించి నాన్ స్టాప్ బ్రీత్ లెస్ డైలాగ్ చెప్పి, అందరిచేత చప్పట్టు కొట్టిస్తున్నాడు సంపూర్ణేష్. సినిమాలో మూడు గెటప్స్ లో సంపూ కనిపిస్తాడు. వాటిలో రెండు గెటప్స్ ను చూచాయగా టీజర్ లో చూపించారు మూవీ టీం. ఎక్కువగా రాయుడు గెటప్ లో కనిపిస్తున్న సంపూర్ణేష్ అద్భుతంగా చేశాడని చెప్పాలి. ఈ టీజర్ ను మెగా హీరో సాయి ధరమ్ తేజ రిలీజ్ చేశాడు. ఆడియో రిలీజ్ టైం లో కూడా ఇదే డైలాగ్ ను స్టేజ్ పై చెప్పి ఆడియన్స్ ను అలరించాడు సంపూ. యూట్యూబ్ తో పాటు, ట్విట్టర్లో బర్నింగ్ స్టార్ ట్రెండ్ అవుతున్నాడు. కేవలం తొమ్మిదే గంటల్లో లక్ష వ్యూస్ ను టీజర్ దాటేసింది. అతని లాంటి ఒక చిన్న హీరో సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ ఉండటం విచిత్రమే. ట్విట్టర్లో కూడా కొబ్బరి మట్ట టీజర్ లాంచ్ అనే పదం ట్రెండ్ అయింది. హృదయకాలేయం తర్వాత సంపూ అలాంటి భారీ హిట్ ను మళ్లీ కొట్టాలని ఆకాంక్షించారు ఆడియో వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు. రూపక్ రొనాల్డ్ సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ను సాయి రాజేష్ నిర్మిస్తున్నారు.