English | Telugu

సరిగ్గా ఆ టైమ్‌కి పవన్ గిఫ్ట్ పంపారు..!

on Oct 12, 2017

సెలబ్రిటీల పెళ్లిలలో కానుకలకు కొదవుండదు. వారి స్థాయికి తగ్గట్టే కోట్లల్లో వస్తుంటాయ్. అలాగే.. చైతూ దంపతులకు కూడా కానుకలు ఘనంగానే అందాయట. వాటిల్లో వారు కూడా ఊహించని బహుమతులు రెండొచ్చాయ్. అవే ఖరీదైన డైమండ్ రింగ్స్. వాటిని పంపిందెవరో కాదు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్. 

‘అత్తారింటికి దారేది’ సినిమాకి పవన్, త్రివిక్రమ్ తో కలిసి సమంత పనిచేసింది. అంతేకాదు... త్రివిక్రమ్ కెరీర్ లో అత్యధిక చిత్రాల్లో కథానాయిక కూడా సమంతే. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ.. చిత్రాల్లో సమంత కథానాయికగా నటించింది. ఆ అభిమానంతోనే త్రివిక్రమ్... పవన్ తో కలిసి ఈ విలువైన బహుమతుల్ని చైతూ దంపతులకు అందజేసినట్లు సమాచారం. 

నిజానికి హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్లో ఈ కానుకలు అందిద్దామనుకున్నారట. కానీ... పెళ్లిలో ఇస్తేనే బావుంటుందని.. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఈ కానుకలు అందించారని విశ్వసనీయ సమాచారం. అనుకోకుండా... త్రివిక్రమ్, పవన్ ల దగ్గరనుంచి వచ్చిన ఈ బహుమతి చూసి సమంత పొంగిపోయిందని టాక్. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here