సల్మాన్ మేనల్లుడు మరణించింది కరోనాతో కాదు!
on Apr 1, 2020
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ సోమవారం ముంబైలో మరణించారు. అతడి వయసు ఎక్కువ ఏమీ కాదు, 38 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో అబ్దుల్లా మరణించడానికి కారణం కరోనా అని పుకార్లు వచ్చాయి. వాటిని సల్మాన్ మేనేజర్ జోర్డీ పటేల్ ఖండించారు. కరోనా కారణంగా అబ్దుల్లా మరణించలేదని ఆయన తెలిపారు. అబ్దుల్లాకి కరోనా టెస్టులు చేయగా, రిజల్ట్స్ 'నెగిటివ్' అని వచ్చినట్టు జోర్డీ వివరించారు.
అబ్దుల్లా ఖాన్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ముంబైలోని అంధేరిలో ఆసుపత్రిలో చేరారు. సల్మాన్ సూచన మేరకు, మెరుగైన వైద్యం అందించడానికి బాంద్రాలో మరో ఆసుపత్రికి అబ్దుల్లాను షిఫ్ట్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. అబ్దుల్లాది ఇండోర్ సిటీ. మరణానంతరం పార్దివ దేహాన్ని అక్కడికి తీసుకువెళ్లారు. స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మేనల్లుడి మరణంతో సల్మాన్ బాగా అప్సెట్ అయ్యారని, లాక్ డౌన్ కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేనందుకు బాధపడుతున్నారని మేనేజర్ వివరించారు.
Also Read