వందకోట్లకు పరుగులు పెడుతున్న 4 కోట్ల సినిమా..!
on Jun 1, 2016
ఆ సినిమా బడ్జెట్ కేవలం నాలుగు కోట్లు మాత్రమే. చాలా చిన్న సినిమాగా తెరకెక్కింది. కానీ భారీ భారీ సినిమాల్ని కూడా పక్కకు పెట్టేసి రేస్ లో వందకోట్ల క్లబ్ కు పరుగులు తీస్తోంది. ఎప్పుడో గానీ జరగని ఇలాంటి రేర్ ఫీట్ ను సాధించిన ఆ మరాఠీ సినిమా పేరు సైరత్. ఆకాష్ తోనర్, రింకూ రాజ్ గురు అనే కొత్త హీరోహీరోయిన్లను పెట్టి నాగరాజ్ మంజులే దర్శక నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఏదో ఫర్లేదనిపించుకుంటుంది అని అందరూ అనుకుంటే, వారి అంచనాల్ని మించిపోయి సంచలనాత్మక విజయాన్ని సాధించేసింది సైరత్. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నెల రోజుల్లో 75 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంకా 350కు పైగా థియేటర్లలో ఇంకా రన్ అవుతుండటంతో, వందకోట్ల క్లబ్బులో చేరిపోవడం కన్ఫామ్ అంటున్నారు. సినిమా సరిగ్గా తీస్తే, బడ్జెట్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అవుతుందన్న విషయాన్ని ప్రూవ్ చేసింది సైరత్ మూవీ. మనోళ్లు కూడా ఓ ఎగబడి బడ్జెట్ పెట్టేయకుండా లిమిట్ లో మంచి కథను నమ్మి సినిమా తీస్తే, ఇండస్ట్రీకి లాభాల బాట పట్టడమే కాక, మంచి సినిమాలు కూడా వస్తాయి..కాదంటారా..?