సైరా షూటింగ్ ఆగిపోయింది
on Jul 13, 2018
చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా షూటింగ్ ఆగిపోయింది. హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ చిత్రం ఔట్డోర్ షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కోకాపేట్లో నిర్మించిన భారీ సెట్టింగులో ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలు చిత్రిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల షూటింగ్ సాధ్యపడటం లేదని తెలుస్తోంది. దీని వల్ల వేర్వేరు నటుల కాల్షీట్స్ అన్నీ కలగాపులగం అయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాగే కనుక కొనసాగితే ముందుగా అనుకున్నట్లుగా మే నెల నాటికి ఈ చిత్రం విడుదల కావడం కష్టమే! సైరా షూటింగ్ తర్వాత చాలా రోజులు కేవలం స్పెషల్ ఎఫెక్టులకే సమయం కావాల్సి వస్తుంది. మరి వరుణుడు సైరాను ఎంత త్వరగా కరుణిస్తాడో చూడాల్సిందే! వాతావరణ శాఖ మాత్రం మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవని తేల్చి చెప్పేసింది!!!