మహేష్‌బాబు.. నా చైల్డ్‌హుడ్ క్రష్!
on Mar 30, 2020
తెలుగులో తనకి ఇష్టమైన హీరో నాని అని రుహానీ శర్మ చెప్పింది. విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన 'హిట్' సినిమాలో నటించిందీ హిమాచల్ అమ్మాయి. అంతకు ముందు 'చి.ల.సౌ'తో విజయం అందుకుంది. లాక్డౌన్ వల్ల ఇంటికి పరిమితం కావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి ఆమె ఏం చెప్పిందంటే...
• క్వారంటైన్ డేస్ ఎలా ఉన్నాయి?
సూపర్ ఫన్.
• క్వారంటైన్ టైమ్‌లో ఏం ఏం చేస్తున్నారు?
మా ఇల్లు శుభ్రం చేస్తున్నా. ఎక్సర్సైజులు చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తున్నా. మెడిటేషన్ చేస్తున్నా. అప్పుడప్పుడూ నా సిస్టర్ ఫొటోలు తీస్తున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నా.
• విశ్వక్ సేన్ మీద మీ అభిప్రాయం?
వెరీ టాలెంటెడ్. ప్రొఫెషనల్..
• అల్లు అర్జున్‌తో సినిమా చేయండి.
ఇది నా డ్రీమ్.
• ప్రభాస్ గురించి కొన్ని మాటలు?
ఎంతో ప్రతిభ ఉన్న నటుడు..
• తారక్ (ఎన్టీఆర్) అన్న గురించి మీ మాటల్లో వర్ణించండి
చాలా మంచి యాక్టర్.
• సూపర్‌స్టార్ మహేష్‌బాబు గురించి ఒక్క మాట
ఆయన నా చైల్డ్‌హుడ్ క్రష్.
• మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
హాహా.... లేడు.
• ఇటాలియన్ వైన్ బాటిల్ ఉంటే ఇస్తారా?
నో...! నేను ఆల్కహాల్ తాగను.
• ప్రస్తుతం మీ చేతిలో ఉన్న తెలుగు సినిమా?
నూటొక్క జిల్లాల అందగాడు (ఇందులో అవసరాల శ్రీనివాస్ హీరో). హిందీలో 'ఆగ్రా' సినిమా చేస్తున్నా.