ఆ నగ్న చిత్రాన్నిఆర్జీవీ రెండు రోజుల్లో తీసేశాడు!
on Jul 2, 2020
ఏటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిల్మ్ 'నేక్డ్' (తెలుగులో 'నగ్నం').. ఆయన ఖర్చు పెట్టిన దానితో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా డబ్బులు సంపాదించి పెట్టింది. కేవలం 22 నిమిషాల నిడివి కలిగిన ఆ అడల్ట్ షార్ట్ ఫిల్మ్‌ను షూట్ చేయడానికి ఆయన ఎన్ని రోజులు టైమ్ తీసుకున్నాడో తెలుసా? కేవలం రెండు రోజులు! అవును. రెండంటే రెండు రోజుల్లో ఆ ఫిల్మ్‌ను తీసేశాడు వర్మ. అందులో ఒక అపార్ట్మెంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఆ అపార్ట్‌మెంట్‌కు ఓనర్ అయితే ఎలా ఉంటుందోనని ఊహల్లో తేలే పాత్రను పోషించిన తార పేరు శ్రీ రాపాక అలియాస్ స్వీటీ. ఆమెకు రోజుకు రూ. లక్ష చొప్పున రెండు రోజులకు రెండు లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చాడు ఆర్జీవీ.
ఫిల్మ్‌లో అత్యధిక భాగం వక్ష స్థలాన్ని, తొడలను ప్రదర్శించే ఆ పనిమనిషి పాత్రను చేసిన శ్రీ రాపాక.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతకంటే ఆశ్చర్యం కలిగించేంది.. ఆమె యు.ఎస్.లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అలాంటి ఉన్నత విద్యావంతురాలు అలాంటి నగ్న పాత్ర చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే కదా!!