సెట్స్ మీదకు వర్మ ‘కరోనా వైరస్’ సినిమా
on Jul 1, 2020
లాక్డౌన్ తరవాత షూటింగ్ స్టార్ట్ చేసిన తొలి సినిమా ‘క్రష్’. దర్శకుడు రవిబాబు తక్కువమందితో షూటింగ్ చేస్తున్నారు. ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా నటిస్తున్న ‘సూపర్ మచ్చి’ షూటింగ్ మొదలైంది. మూడో సినిమాగా కరోనా వైరస్ మీద వర్మ రూపొందిస్తున్న సినిమాను చెప్పుకోవాలి. వర్మ అంటే రామ్‌గోపాల్ వర్మ కాదు... ప్రశాంత్ వర్మ.
‘అ!’తో దర్శకుడిగా పరిచయమై, రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ కరోనా వైరస్ మీద ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందు కొంత షూటింగ్ చేశారు. లేటెస్ట్గా లాస్ట్ వీక్ హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. రైటర్ కమ్ యాక్టర్ హర్షవర్ధన్, ఆర్టిస్ట్ ప్రియ మీద సీన్స్ తీస్తున్నారట. ఇండోర్‌లో అతి తక్కువ మందితో కరోనా గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ షూటింగ్ చేస్తున్నారట. స్టోరీ అంతా కరోనా వైరస్ చుట్టూ తిరుగుతుందట.